జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Tollywood Movie Zamana Review and Rating In Telugu | Sakshi
Sakshi News home page

Zamana Movie Review: జమానా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Jan 30 2026 6:06 PM | Updated on Jan 30 2026 6:10 PM

Tollywood Movie Zamana Review and Rating In Telugu

సూర్య శ్రీనివాస్, సంజీవ్, స్వాతి కశ్యప్  నటించిన తాజా చిత్రం జమానా.  భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..

మ్యూజియంలో దొంగతనంతో సినిమా ప్రారంభమవుతుంది. హీరో సూర్య ఒక దొంగ.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు. అదే సమయంలో స్వాతితో ప్రేమలో పడతాడు. ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్, ఒక రాజకీయ నాయకుడు , ఒక మాఫియా లీడర్. ఇలా ఒక పెద్ద టీం ఉంటుంది.. ఈ అన్ని టీం లకు ఒకరికి తెలీకుండా ఒకరు డీలింగ్స్‌ ఉంటాయి. అసలు గ్యాంగ్స్‌ చేసే స్కామ్స్‌  ఏంటో తెలియాలంటే జమానా సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్‌లో హీరో చేసే స్కాం ల చుట్టే తిరుగుతుంది.  సంజీవ్ ఎపిసోడ్ .. పది లక్షలు ఎపిసోడ్ ప్రథమార్థంలో ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ఇంకా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అసలు ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌  బ్యాంగ్ పడుతుంది.  డైరెక్టర్ భాస్కర్ జక్కుల తాను  తీసుకున్న లైన్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. 

ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్‌లో కథ పరిగెడుతుంది . మరీ  ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. అతను రాసుకున్న కథ, కథనం చాలా బాగుంది. ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. దర్శకుడి మేకింగ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా క్లైమాక్స్‌ సూపర్బ్‌ అనేలా ఉంది.  డైరెక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు.. ప్రేక్షకుల్లో థ్రిల్లింగ్‌ కలిగించాడు. థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వారికి జమానా ఓకే.

ఎవరెలా చేశారంటే..

హీరో సూర్య చాలా అద్భుతంగా చేశాడు. హీరోయిన్ స్వాతి కశ్యప్ తన గుడ్ లుక్‍తో అదరగొట్టేసింది. సాంకేతికత విషయానికొస్తే విజువల్ పరంగా కూడా గ్రాండ్‌గా ఉంది.  కేశవ కిరణ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు.  వర్మ ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్  వాల్యూస్ నిర్మాణ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement