'బెడ్‌రూమ్ వీడియో ల్యాప్‌టాప్‌లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే! | malayalam actor Jeethu Joseph Basil Joseph film Nunakuzhi review in telugu | Sakshi
Sakshi News home page

Nunakkuzhi Movie Review in telugu: 'బెడ్‌రూమ్ వీడియో ల్యాప్‌టాప్‌లో బంధిస్తే'.. నునాకుజి మూవీ చూడాల్సిందే!

Dec 7 2025 12:02 PM | Updated on Dec 7 2025 1:06 PM

malayalam actor Jeethu Joseph Basil Joseph film Nunakuzhi review in telugu

ఓటీటీలు వచ్చాక సినిమాల పరంగా కంటెంట్‌కు కొదువే లేదు. ఏ భాషలో తెరకెక్కించినా సరే డబ్బింగ్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. కంటెంట్‌ పరంగా మలయాళ చిత్రాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతున్నాయి. అలా గతేడాది రిలీజైన మలయాళ చిత్రం  నునుకుజి. ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు దృశ్యం డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చదివేయండి.

ఏబీ జకారియా (బసిల్ జోసెఫ్) మంచి కోటీశ్వరుడు. తన  తండ్రి మాట కోసం రిమీ (నిఖిలా విమల్)ను పెళ్లాడాతాడు. తండ్రి చనిపోయాక.. వాళ్ల కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒక రోజు అనుకోకుండా ఏబీ జకారియా తన వింత కోరికతో చిక్కులో పడతాడు. భార్యతో శృంగారాన్ని  రికార్డ్ చేసి, వీడియోగా తన ల్యాప్ టాప్‌లో స్టోర్ చేస్తాడు. భార్య ఎంతగా చెప్పిన డిలీట్ చేయడు. అదే అతన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒక రోజు ఊహించని పరిణామాలతో ఏబీ జకారియా ల్యాప్‌టాప్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ చేతికి వెళ్తుంది. ఈ విషయం తెలిసిన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు ఆ ల్యాప్‌టాప్‌ చివరికీ జకారియాకు దొరికిందా? తన ల్యాప్‌ టాప్ కోసం జకారియా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే నునాకుడి కథ.

ఎలా ఉందంటే..


దృశ్యం డైరెక్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీతూ జోసెఫ్ తన థ్రిల్లర్‌ కంటెంట్‌తో అభిమానులను కట్టిపడేయడంలో దిట్ట. ఆ విషయం దృశ్యం చూసిన వాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. నునాకుజి కథలో సస్పెన్స్‌తో పాటు కామెడీని జొప్పించారు. సున్నితమైన సబ్జెక్ట్‌తో సస్పెన్స్‌ ‍క్రియేట్ చేసి ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చిపడేశాడు. నాలుగు గోడల మధ్య జరిగే తంతును కెమెరాలో బంధిస్తే ఎలాంటి ఇబ్బందులువు ఎదురవుతాయనే సింపుల్‌ సబ్జెక్ట్‌ను సీరియస్‌గా కాకుండా కామెడీ కోణంలో చూపించడం జీతూ జోసెఫ్‌కే సాధ్యమని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సీన్స్ బోరింగ్‌ అనిపించవు. కథలో సీరియస్‌నెస్‌తో పాటు సమపాళ్లలో కామెడీ పండించేందుకు డైరెక్టర్‌ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ కథ మొత్తం కేవలం ఆ ఒక్క ‍ల్యాప్‌ టాప్‌ చుట్టే తిప్పాడు. చివరి వరకు ల్యాప్‌ టాప్‌ కోసం సాగిన ఈ కథలో క్లైమాక్స్‌లోనూ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తెలియాలంటే నునాకూజి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా జీ5 వేదికగా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్‌లో మంచి సస్పెన్స్ ప్లస్ కామెడీ ఎంటర్‌టైనర్‌ కావాలంటే నునాకుజి చూసేయండి. 
  
  ఎవరెలా చేశారంటే..

మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ నటన మన తెలుగువారికి తెలిసిందే.  బసిల్ జోసెఫ్ తన పాత్రలో అదరకొట్టాడు.  రష్మిత రంజిత్‌ పాత్రలో గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్దీఖి తమ పాత్రలకు న్యాయం చేశారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎస్‌ వినాయక్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఎక్కడా బోరింగ్ కొట్టకుండా కట్‌ చేశాడు.  విష్ణు శ్యామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement