విజయ్ సేతుపతి 'ఏస్‌' సినిమా రివ్యూ | Vijay Sethupathi Ace Movie Telugu Review | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతి 'ఏస్‌' సినిమా రివ్యూ

May 23 2025 4:21 PM | Updated on May 23 2025 5:06 PM

Vijay Sethupathi Ace Movie Telugu Review

విజయ్‌ సేతుపతి నటించిన కొత్త సినిమా 'ఏస్‌' (Ace) థియేటర్స్‌లోకి వచ్చేసింది. రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ చిత్రాన్ని ఆర్ముగ కుమార్‌ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్‌, పృథ్వీరాజ్‌, కీలక పాత్రలలో నటించారు. మే 23న బి. శివ ప్రసాద్ భారీ ఎత్తున తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్‌గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్‌ సేతుపతి ఇప్పుడు ఏస్‌ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకుందాం.

కథ
బోల్ట్‌ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన  నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్‌ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్‌ కన్నన్‌.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్‌ ప్రేమలో పడతాడు.

అయితే, కల్పన తన హోటల్‌ కోసం తీసుకున్న లోన్‌ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందలు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు.

ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్‌ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్‌కు ఉన్న సంబంధం ఏంటి?  ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్‌ పెళ్లి చేసుకుంటాడా..? తనపై నమోదైన నేరాల నుంచి ఎలా బయటపడుతాడు..? అసలు బోల్ట్ కన్నన్‌ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?
దర్శకుడు అరుముగకుమార్ కథ చెప్పడంలో ఒక ప్రత్యేకమైన శైలి తీసుకున్నాడు. సినిమాలోని పాత్రలకు బాగా కనెక్ట్‌ అయిపోతారు. ప్రేక్షకుల ఊహకు అందేలానే కథనం సాగుతూ ఉన్నా కూడా ఎక్కడా అయితే బోర్ కొట్టదు. విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణి వసంత్ అందాలు ఆ లోపాల్ని కప్పి పుచ్చేస్తుంటాయి. అలా సినిమాను ఎంగేజింగ్‌గా తీయడంలో దర్శకుడు  సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే మొదటి అర్ధభాగం కాస్త నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత కథ స్పీడ్‌ అందుకుంటుంది. 

ప్రథమార్దం అంతా కథలోని పాత్రలను   పరిచయం చేసేందుకే సరిపోతుంది. అసలు కథ మొదలు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే హీరో తన వారి కోసం విలన్‌ డెన్‌కు ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి జోరు అందుకుంటుంది. బ్యాంక్‌లో దొంగిలించిన సొమ్ముతో హీరో ఎలా బయటపడతాడు..? ఆ నేరాల్లోంచి ఎలా తప్పించుకుంటాడు..? అనే పాయింట్లతో సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్‌ తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో హీరో చేత డైరెక్టర్ ఆడించే ఆట, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..?
ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. బోల్ట్ కన్నన్‌ పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనేలా పాత్ర ఉంటుంది. మొదటి సారి డార్క్ కామెడీని ఆయన పండించాడు. ఇక యోగి బాబు అయితే ఫుల్‌ లెన్త్‌గా నవ్విస్తాడు. రుక్మిణి వసంత్ ఇందులో తన గ్లామర్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర దక్కింది. అవినాష్ విలనిజం మెప్పిస్తుంది. సాంకేతిక పరంగా కూడా సినిమా బాగుంటుంది. కెమెరామెన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలకు పెద్దగా కనెక్ట్‌ కాకున్నప్పటికీ మ్యూజిక్‌ బాగుంది. శామ్ సీఎస్ ఆర్ఆర్ మెప్పిస్తుంది. కాస్త ఎడిటింగ్‌లో మార్పులు చేసింటే ఇంకా బాగుండేది. విజయ్‌ సేతుపతి కోసం సినిమా చూడొచ్చు. ఎక్కడా కూడా ఎవరినీ నిరుత్సాహపరచడు.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement