పేదలందరికీ లబ్ధి | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ లబ్ధి

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

పేదల ప్రభుత్వంపై

విష ప్రచారం చేస్తున్నారు

రాజకీయ దురుద్దేశాలు లేకుండా

412 మందికి ఇళ్లు

దళారుల నుంచి డబ్బు రికవరీ చేసి బాధితులకు ఇస్తాం

డిప్యూటీ సీఎం భట్టి,

మంత్రులు పొంగులేటి, తుమ్మల

భూదాన్‌ భూముల్లో డిసెంబర్‌ 9న గృహప్రవేశాలు

సాక్షిప్రతినిది, ఖమ్మం : ‘వెలుగుమట్లలో పేదలకు కేటాయించిన భూదాన్‌ భూముల్లో యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్‌ 9న ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో పాలు పొంగించి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభింపజేస్తాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నిర్వాసితులైన 311 మందికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు వారి స్వస్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులతో పంపిణీ చేయించారు. 311 మంది అర్హులకు ఒకేసారి ర్యాండమైజేషన్‌ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి.. ప్లాట్‌ నంబర్లు కేటాయించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కాలనీలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకులాన్ని సైతం నిర్మిస్తామన్నారు. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా భూదాన్‌ భూముల్లో ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని అన్నారు. తాగునీరు, రోడ్లు, ఫంక్షన్‌ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, స్కూల్‌, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్ల నిర్వాసితుల్లో ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిరుపేదలకు వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పట్టాలు పంపిణీ చేశామని, వారి పిల్లల భవిష్యత్‌ కోసం ఇక్కడ మోడల్‌ స్కూల్‌ నిర్మిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పెద్ద మాఫియా నడుస్తోందని అన్నారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటి నిర్మాణ నిధులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌, వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement