కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అంతరాయం లేకుండా చూడాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. 73 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా, శుక్రవారం ఆమె కొత్తగూడెం, పాల్వంచలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పాల్వంచ మండలం కేశవాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాలయాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఈఓ వెంట పలువురు అధికారులు ఉన్నారు.


