రాష్ట్రంలో ధరణి స్థానాన తీసుకొచ్చిన భూ భారతితో ఆశించిన ప్రయోజనాలు రాలేదు. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు, ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణపై చర్చిస్తా. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు, 444, 999, 817, 727, 410 సర్వే నంబర్లలో భూసమస్యలపై ప్రస్తావిస్తా.
– కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
పులుసుబొంత ప్రాజెక్ట్‌కు నిధులు, మణుగూరు, పినపాక మండలాల్లో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని అడుగుతా. మణుగూరులో ఆర్టీసీ బస్టాండ్, సీతారామ పంప్ హౌస్ నుంచి మిట్టగూడెం వరకు గ్రావిటీ కెనాల్‌కు నిధులు మంజూరు చేయాలని, దోమలవాగు చెరువును మినీ రిజర్వాయర్‌గా చేయాలని కోరుతా. – పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే
వైరా నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అసెంబ్లీలో కోరతా. జూలూరుపాడు పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతా. – మాలోతు రాందాస్‌నాయక్, వైరా ఎమ్మెల్యే


