చికిత్స పొందుతున్న యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న యువకుడు మృతి

Mar 15 2026 1:19 AM | Updated on Mar 15 2026 1:19 AM

అశ్వాపురం: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఖమ్మంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని మొండికుంటకు చెందిన సంగు కిరణ్‌కుమార్‌(38) శనివారం మృతి చెందాడు. వివరాలిలా.. గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే కిరణ్‌కుమార్‌ తండ్రి అనా రోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుండగా.. తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈక్రమంలో కిరణ్‌కుమార్‌ అనారోగ్యంతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురికాగా.. వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో కొడుకుకు ఎలాగైనా బతికించుకోవాలని తల్లి దాతల సహాయం కోరింది. దీంతో ఈనెల 13న ‘ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా.. కొందరు తమ వంతు సహాయం చేసినా మృత్యు పోరాటంలో కిరణ్‌కుమార్‌ గెలవలేక మృతి చెందాడు. అయితే హైదరాబాద్‌కు చెందిన జీవన్‌దాన్‌ సంస్థ బాధ్యులు అవయవదానం కోసం మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడగా.. వారి అంగీ కారంతో కాలేయాన్ని దానం చేశారు.

తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం

అశ్వాపురం: మండల పరిధిలోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన తాటి భువన్‌చందు గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం స్కూల్‌ కి వెళ్లి సాయంత్రం ఇంటికి రాలేదు. రాత్రి వరకు ఎదురుచూసిన విద్యార్థి తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూ కీ లభించకపోవడంతో వారు అశ్వాపురం పోలీసులకు సమాచా రం అందించారు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యాన పోలీసులు విచారించగా.. శనివారం బాలుడు వైరా పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆతర్వాత వారు అక్కడకు చేరుకుని బాలుడిని ఇంటికి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు

చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి ప్రియుడు మీరాతో కలిసి భార్య ఖతిజా, భర్త జాఫర్‌ను హతమార్చిన విష యం విదితమే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదాంతంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతుడి భార్య ఖతిజాతో పాటు చింతలపుడికి చెందిన ప్రియుడు మీరాను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మణుగూరు బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపాల్‌,

వార్డెన్‌ సస్పెన్షన్‌..

మణుగూరు టౌన్‌: మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల, మెస్‌ పర్యవేక్షణతో వార్డెన్‌, ప్రిన్సిపాల్‌ విధుల్లో నిర్లక్ష్యం చూపిన కారణంగా ఈ నెల 9వ తేదీన విద్యార్థినులు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురై 100 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విధితమే. ఈ నేపథ్యాన 11న వార్డెన్‌, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు వెలువడగా.. ఈ విషయం శనివారం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉండగా.. గత ఆదివారం విద్యార్థుల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారం తినడంతోనే అస్వస్థతకు గురయ్యారని హాస్టల్‌ నిర్వాహకులు అధికారులకు చెప్పారు. ఆతర్వాత ఒకరి తర్వాత మరొకరు ఇలా సుమారు 15 మంది అస్వస్థతకు గురికాగా అందులో కొందరు హాస్టల్‌లోనే చికిత్సలు పొందారు. డీసీఓ విచారణతో పాటు అధికారుల తనిఖీల్లో హాస్టల్‌ నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ అంకిత్‌ సస్పెన్షన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement