విశారదన్‌ మహరాజ్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విశారదన్‌ మహరాజ్‌ అరెస్టు

Mar 17 2026 7:38 AM | Updated on Mar 17 2026 7:38 AM

కొణిజర్ల/మధిర: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ధర్మ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌ను కొణిజర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ జి.సూరజ్‌ కథనం ప్రకారం.. విశారదన్‌ మహరాజ్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కొణిజర్ల హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి పరిశీలించి, ఆయనను అదుపులోకి తీసుకుని కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విశారదన్‌ మహరాజ్‌పై బైండోవర్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం ఆయనను మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ రద్దీగా ఉండటంతో మధిర రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు రెండు గంటల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement