భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చా రు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
హెచ్‌టీ సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): హెచ్‌టీ 11కేవీ, 33కేవీ ఆపై ఓల్టేజీ సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ అందుబాటులోకి తెచ్చినట్లు విద్యుత్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలి పారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరా లు వెల్లడించారు. హెచ్‌టీమానిటర్ సెల్‌ను సర్కి ల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేశామని అన్నారు. సింగిల్ విండో కొత్త విధానంలో వినియోగదారులు టీజీఎన్‌పీడీసీఎల్‌పోర్టల్‌లో అవసరమైనపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను తమశాఖ అధికారులు పర్యవేక్షిస్తారని, ఫీజిబిలిటీ కోసం క్షేత్రస్థాయిలో సిబ్బంది పరి శీలిస్తారని చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థతో త్వరితగతిన సర్వీసులు మంజూరవుతాయని, పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచా రం ఇస్తామని వివరించారు.
హిందీ భాషా అభివృద్ధి ప్రాజెక్ట్ మంజూరు
పాల్వంచరూరల్: గిరిజన విద్యార్థుల్లో హిందీ భాషా అభివృద్ధి పరిశోధనకు ఐసీఎస్‌ఎస్‌ఆర్ మైనర్ రీసె ర్చ్ ప్రాజెక్టు మంజూరైంది. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో హిందీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న డాక్టర్ టి.అరుణకుమారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ద్వారా ప్రతిష్టాత్మకమైన మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి. పద్మ తెలిపారు. ఆది వాసీ విద్యార్థులకు హిందీ భాషా అభ్యాసంలో ఉన్న సవాళ్లు, పరిష్కారాలు, బహుభాష, సామాజిక, సాంస్కృతిక అధ్యయనంపై అరుణకుమారి పరిశోధన చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమెను ప్రిన్సిపాల్‌తోపాటు తోటి అధ్యాపకులు సన్మానించారు.
బరిలో 20 మంది
ఈ నెల 26న బార్ అసోసియేషన్ ఎన్నికలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల బరిలో 20 మంది మిగి లారు. స్క్రూట్నీ అనంతరం 49 మంది బరిలో ఉండగా, సోమవారం 29 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 20 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి పలివెల గణేష్‌బాబు, సహాయ ఎన్నికల అధికారులు అరకల కరుణాకర్, పీ వేణువాసరావు తెలిపారు. వీరిలో మహిళా ప్రాతినిధ్యం కింద నిమ్మలూరి ఉషారా ణి ఏకగ్రీవమయ్యారు. అధ్యక్ష పదవికి ఇద్దరు , మహిళా వైస్ ప్రెసిడెంట్‌కు ఇద్దరు, వైస్ ప్రెసిడెంట్–2 కు ఇద్దరు, జనరల్ సెక్రటరీకి ముగ్గురు, జాయింట్ సెక్రటరీకి ఇద్దరు, లైబ్రరీ సెక్రటరీకి ఇద్దరు, మహిళా ట్రెజరర్‌కు ఇద్దరు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు, మహిళా స్పోర్ట్స్ అండ్‌కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు బరిలో ఉన్నారు. కాగా ఈ నెల 26న ఎన్నికలు జరుగనున్నాయి.


