పెరుగుతున్న ఆసక్తి..
రాయితీపై ప్రభుత్వం నుంచి డ్రోన్లు
సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత
ఇప్పటికే శిక్షణ తీసుకుంటున్న రైతులు
బూర్గంపాడు: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం రైతులకు రాయితీపై డ్రోన్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. పంటల సాగులో ఖర్చులు తగ్గించి సాంకేతికతతో కూడిన యంత్ర పరికరాలను అందించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్(స్మామ్) పథకం కింద జిల్లాలోని రైతులకు అందించనున్నారు. ఇందుకోసం దశల వారీగా అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో రైతులకు గరిష్టంగా రూ.4లక్షల వరకు రాయితీ అందనుంది. తొలుత సన్న, చిన్నకారు, మహిళా రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యతనివ్వనున్నారు.
తగ్గనున్న పెట్టుబడులు..
పంటల సాగులో ముఖ్యంగా పురుగుమందుల పిచి కారీలో ఖర్చులను తగ్గించేందుకు డ్రోన్లు ఎంతగానో రైతులకు ఆదా చేస్తాయని వ్యవసాయశాఖ చెబుతుంది. పిచికారీకి గతంలో అయ్యే ఖర్చులో 70శాతం వరకు తగ్గుతుందని అధికారులు సూచిస్తున్నారు. పురుగుమందులతో పాటుగా లిక్విడ్ ఎరువులు, మైక్రోన్యూట్రియట్స్‌ను కూడా పిచికారీ చేసు కుని పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాలలో డ్రోన్ల వినియోగం అందుబాటులోకి వచ్చింది.
కూలీల కొరతకు చెక్..
కూలీల కొరతతో రైతులు సకాలంలో పంటలపై మందులు పిచికారీ చేసుకోలేకపోతున్నారు. కూలీ లు దొరికిన రోజుకు నాలుగైదు ఎకరాలలోని పంటలకే మందులు పిచికారీ చేసే పరిస్థితులున్నా యి. ఒక ఎకరాలో మందుల పిచికారీకి రైతులకు మాన్యువల్‌గా రూ.700 వరకు ఖర్చవుతుండడంతో పాటు మందుల విషప్రభావంతో వారు అస్వస్తులై అనా రోగ్యానికి గురవుతున్నారు. అదే డ్రోన్‌తోనైతే ఎకరాకు రూ.200 ఖర్చు మాత్రమే సరిపోతుంది. మనుషులపై కూడా ఎలాంటి విషప్రభావం లేకపోవడం కూడా కలిసొచ్చే అంశం. ఇప్పటికే డ్రోన్ల వినియోగంపై పలువురు రైతులు శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
సామర్థ్యం ఆధారంగా ధరలు..
రాయితీపై రైతులకు అందించే డ్రోన్లకు సంబంధించిన తొమ్మిది కంపెనీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయా కంపెనీలు తమ డ్రోన్ల సామ ర్థ్యం ఆధారంగా కనిష్టంగా రూ.9.80లక్షలు, గరి ష్టంగా రూ.14.95లక్షల ధరలతో ముందుకు తీసుకొచ్చా యి. యువ రైతులు కొందరు ఇప్పటికే వీటి ని కొనుగోలు చేసి తమ పంటలకు వినియోగించడంతో పాటు ఇతర రైతులకు కూడా మందుల పిచికా రీకి వినియోగించి ఆదాయం పొందుతున్నారు.
జిల్లాలో రైతులు పత్తిచేలలో మందుల పిచి కారీ కి గతఐదారేళ్లుగా ట్రాక్టర్‌కు స్ప్రేయర్లు బిగించి వాడుకుంటున్నారు. దీంతో సమయం ఆదా చేసుకోవడంతో పాటు కూలీల ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అయితే వరి మాగాణులలో బురదలో దిగి మందులు కొట్టేందుకు కూలీలు రావడంతో చాలామంది రైతులు డ్రోన్ల వైపు దృష్టి సారించారు. అదేవిధంగా మిర్చి,కూరగాయ ల పంటల సాగులోనూ వీటి వినియోగం తప్పనిసరి పరిస్థితులున్నాయి. ప్రభుత్వం రాయితీ తో డ్రోన్ల కొనుగోలుకు ప్రోత్సహిస్తుండడంతో కొందరు యువ రైతులు ముందుకొస్తున్నారు.
ఆధునిక సాగువైపు రైతాంగం


