పన్నుల కోసం పరుగులు.. | - | Sakshi
Sakshi News home page

పన్నుల కోసం పరుగులు..

Mar 10 2026 7:31 AM | Updated on Mar 10 2026 7:31 AM

ఇప్పటివరకు సగం మేర

మాత్రమే వసూళ్లు

మిగిలిన గడువు 20 రోజులే

ఉమ్మడి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లోనే 50 శాతం దాటిన వైనం

ఇల్లెందు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానిక మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెలాఖరు నాటికి 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో వసూళ్లు ఇప్పటివరకు 50 శాతానికి మించలేదు. గత రెండు నెలలుగా మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి కుస్తీ పడుతున్నా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నారు.

బిల్లు చెల్లించగానే ఆన్‌లైన్‌..

మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది తమ వెంట పేయింగ్‌ మిషన్‌తో ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. గతంలో మ్యానువల్‌గా డబ్బు తీసుకుని రసీదు ఇచ్చేవారు. మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాక ఆపరేటర్లతో కంప్యూటరీకరణచేయించేవారు. అయితే ఇప్పుడు పేయింగ్‌మిషన్ల వినియోగంతో బిల్లు చెల్లించిన వెంటనే నేరుగా ఆన్‌లైన్‌ అవుతోంది. ఇదంతా బాగానే ఉన్నా మరో 20 రోజుల్లో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయడం ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలోనిప్రతీరోజు కనీసం రూ.2లక్షలు వసూలుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంటి, నల్లా పన్నులతో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌లు రెన్యువల్‌ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

వసూలైతేనే వేతనాలు..

పట్టణాల్లో ఇంటి, ఇతర పన్నులు వసూలయితేనే శానిటేషన్‌, వాటర్‌ వర్క్స్‌, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, ఎన్‌ఎంఆర్‌లకు వేతనాలు అందేది. ఈ నిధులను జనరల్‌ ఫండ్‌ఖాతాలో జమ చేసి అవసరమైనప్పుడు శానిటేషన్‌, వాటర్‌వర్క్స్‌ మెటీరియల్‌ కొనుగోలు కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు మూడు మున్సిపాల్టీల్లో మాత్రమే సగానికి మించి వసూలు చేయగా మిగిలిన మున్సిపాల్టీలు సగానికి దరిదాపుల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement