భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడామండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ,యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణా న్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరామ్ తార్నికంటి శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం రూ.కోటి
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను సోమవారంచిత్రకూటమండపంలో లెక్కించా రు. 40 రోజులకు గాను రూ. 1,05,94,000తో పాటు 80 గ్రాముల బంగారం, 650 గ్రామల వెండి, యూఎస్ డాలర్లు 91, వియత్నాం కరెన్సీ 5,000 న్యూజిలాండ్ డాలర్లు 110, ఇతర విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. అనంతరం నగదును బ్యాంకర్లుకు అప్పగించారు.
ప్రతీ ఉద్యోగి రక్షణ
సూత్రాలు పాటించాలి
పాల్వంచ: కర్మాగారంలోని ప్రతీ ఉద్యోగి విధి గా రక్షణ సూత్రాలు పాటించాలని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం స్థానిక కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. భద్రత చర్యలు పాటిస్తే సంస్థ, ఉద్యోగి, కార్మి కులతో పాటు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జెన్‌కో ట్రైనింగ్ సెంటర్ సీఈ పార్వతి, డిప్యూ టీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వెంకన్న, ఎస్‌ఈలు బి.శివరాంరెడ్డి, టి.సత్యనారాయణ, ధర్మారావు, సీసీఏ రామారావు, వెంకటేశ్వర్లు, సీహెచ్‌పీ సునీల్, డీఈ సమ్మయ్య, ఎస్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్, ఫైర్ ఆఫీసర్ వై.శ్రీనివాస్, ఏఈ మహేష్, నాగరాజు, రజిని పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్
అవార్డుకు ఎంపిక
అశ్వారావుపేటరూరల్: భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభత్వ శాస్త్ర సాంకేతిక విభాగం వా రు ప్రతీ సంవత్సరం నిర్వహించే ఇన్‌స్పైర్ అవార్డుకు అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి నూతి సాయి కౌశిక్ ఎంపికై నట్లు హెచ్‌ఎంహరి త తెలిపారు. ఈమేరకు ఆమె సోమవారంమాట్లాడుతూ.. పాఠశాల సైన్స్ ఉపా ధ్యాయుడు చలపతిరావు పర్యవేక్షణలో బహుళ ప్రయోజనాల గొడుగును సాయి ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాడని, ఈఏడాది అక్టోబర్ లో నిర్వహించే జిల్లాస్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నాడని వివరించారు.
వంద శాతం
ఫలితాలు సాధించాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ యోగితారాణా సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీ–శాట్ ద్వారా సోమవారం ప్రసారం అయిన యోగితారాణా మోటివేషన్, గైడెన్స్ స్పీచ్‌ను విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. పరీక్షల వేళ ఉపాధ్యాయులు వ్యవహరించాల్సిన తీరుపై కూడా యోగితారాణా పలు సూచనలు చేశారని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు.


