ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ అంకిత్
చుంచుపల్లి: హెచ్‌పీవీ టీకాతో మహిళల్లో గర్భాశయ ముఖ కేన్సర్‌ను నివారించవచ్చని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. టీకాల కార్యక్రమాన్ని ఆదివారం ఆయన కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కలెక్టర్ అంకిత్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అర్హులైన బాలికలందరికీ టీకా అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, డీఎంహెచ్‌ఓ తుకారామ్ రాథోడ్, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధామోహన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా పాల్గొన్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్లు అందించాలి
పాల్వంచ: పద్నాలుగు ఏళ్లు నిండి, 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు అన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్, హరీష్, సీతమ్మ, రాంప్రసాద్, సిబ్బంది ఎస్.కృపామణి, ఎం.రమాదేవి, సల్మా పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీని కలిసిన
కొత్తగూడెం ఎమ్మెల్యే
రుద్రంపూర్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతిని శనివారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం సింగరేణి డైరెక్టర్లు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు, నాయకులు ఎస్‌కే సాబీర్‌పాషా, వంగా వెంకట్ పాల్గొన్నారు.


