పాల్వంచరూరల్: గిరిజన ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులు, స్థానిక నైపుణ్యాలను ఉపయోగించుకుని వ్యాపారాలను అభివృద్ధి చేస్తే ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ శివరాంప్రసాద్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీ య సదస్సు సోమవారం ప్రారంభమైంది. ‘ఎంపవరింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ త్రూ అపార్చునిటీస్, చాలెంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్స్’ అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన సహజ సాధికారితలో పారిశ్రామిక అవకాశాల ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫొప్రెసర్ పి.పద్మ, రిసోర్స్ పర్సన్ డాక్టర్ సత్యావతి, రిటైర్డ్ ఫొఫ్రెసర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ నారాయణస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జె.మాధవి, కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 95 మంది రిజిస్ట్రర్ చేసుకున్న పరిశోధన పత్రాల పుస్తకాలను ఆవిష్కరించారు.


