మనువాదమే మహిళలకు శత్రువు | - | Sakshi
Sakshi News home page

మనువాదమే మహిళలకు శత్రువు

Mar 10 2026 7:31 AM | Updated on Mar 10 2026 7:31 AM

రుద్రంపూర్‌: మహిళలు పురుషుడి ముందు, సమాజం ముందు అణిగిమణిగి ఉండాలని చెప్పే మనువాద భావజాలమే మహిళలకు మొదటి శత్రువని సామాజిక కార్యకర్త పీఏ దేవి అన్నారు. అంతర్జాతీ య మహిఽళాదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో సీఐటీయూ, ఐద్వా, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రోజు ఇంటి పని, పిల్లలు, వృద్ధుల సంక్షేమం కోసం మహిళ 10 గంటలకు పైగా శ్రమిస్తోందని, ఈ శ్రమకు ఎక్కడ లెక్కింపు లేదని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, తెలుగుదేశం నాయకులు మహిళలను పిల్లలను కనే యంత్రాలలాగా చూస్తున్నారే తప్ప, మనుషులుగా గుర్తించటం లేదన్నారు. ఇది సమాజంలో పెరుగుతున్న వివక్షకు, మనువాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ శాఖ జిల్లా అధికారి లెనినా, ఐద్వా కార్యదర్శి ఎం.జ్యోతి, జి. పద్మ, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ చింతలపూడి శ్రావణి, శెట్టి వినోద, శ్రీదేవి, ఏజే రమేష్‌, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ పాల్గొన్నారు.

సామాజిక కార్యకర్త పీఏ దేవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement