పార్లమెంట్‌ ముట్టడికి తరలిరండి | - | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ముట్టడికి తరలిరండి

Mar 15 2026 1:19 AM | Updated on Mar 15 2026 1:19 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: అఖిల భారత యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న తలపెట్టిన పార్లమెంట్‌ ముట్టడి కార్యకమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్‌ అధ్యతన జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని రైతుల పొట్ట కొట్టేలా కేంద్రప్రభుత్వం అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ఫలితంగా రైతులను రోడ్డున పడనుండగా, ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలన్నీ నిలదీసినా మోదీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అనంతరం సాయికుమార్‌ మాట్లాడుతూ ఈనెల 16న పార్లమెంట్‌ ఎదుట జరిగే ధర్నాకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో వెళ్లనున్నట్లు తెలిపారు. నాయకులు అంజనీకుమార్‌, బాలగంగాధర్‌, ఆదర్శ్‌, కిరణ్‌, బెల్లం సాయి తేజ, అంబటి ఈశ్వర్‌, చల్లగొండ్ల సాయితేజ, ఖైసర్‌, యశ్వంత్‌, యడ్లపల్లి తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘చలో ఢిల్లీ’ పోస్టర్ల ఆవిష్కరణలో

డీసీసీ అధ్యక్షుడు నూతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement