చుంచుపల్లి: ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యసాధన కోసం రాష్ట్రస్థాయిలో మరో పోరాటం చేయాలని జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షు డు చందా లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవా రం ఆదివాసీ సంఘాలు, ఉపాధ్యాయ – ఉద్యోగ ఆదివాసీసంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జరి గిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను గిరిజనేతరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో దోచుకుంటున్నా రని ఆరోపించారు. 1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కి, ఆర్థిక వనరులు, ఆదివాసీల ఆస్తులు, భూములను కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఇసుక సొసైటీల పేరుతో గిరిజనేతర కాంట్రాక్టర్లు ఆదివాసులను మోసం చేసి ఇసుక క్వారీల ద్వారా పన్నేండేళ్లుగా వచ్చిన ఆదాయం సుమారు రూ.67వేల కోట్లను దిగమింగారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు పొడుగు శ్రీనాథ్, పాయం సత్యనారాయణ, వట్టం నారాయణదొర, రమణాల లక్ష్మ య్య, పూనెం శ్రీనివాస్, వాసం రామకృష్ణదొర, తాటివెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


