● తొలిరోజు 33 మంది విద్యార్థులు గైర్హాజరు ● కేంద్రాల్లో తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, కేంద్రంలోకి ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను అనుమతించారు. హాల్ టికెట్లను పరిశీలించి, విద్యార్థులను తనిఖీ చేశా క కేంద్రంలోకి పంపించారు. కలెక్టర్ అంకిత్ పాల్వంచ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత బాలికల అభ్యు దయ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూ చించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థుల హాజరు ఇలా...
జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు తెలుగు పరీక్షకు 12,720 మంది హాజరు కావాల్సి ఉండగా, 12,687 మంది హాజరయ్యారు. 33మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 20మందికిగాను 14మంది హాజరుకాగా, 6మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 99.74శాతం హాజరు నమోదైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 (బి) అమలు చేశారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్, కొత్తగూడెం, చుంచుపల్లి హైస్కూల్‌లలో తనిఖీలుచేయగా, జిల్లా పరిశీలకులు నాంపల్లి రాజేష్ మూడుసెంటర్లు, జిల్లా విద్యాశాఖాధికారి నాలుగు సెంటర్లు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఐదు సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ 23 సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు.
నిర్లక్ష్యంతో విద్యార్థుల తంటాలు
ములకలపల్లి: ములకలపల్లి హైస్కూల్ సెంటర్ వద్ద 9 గంటల వరకు నోటీస్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో తమ నంబర్ ఏం రూంలో తెలుసుకునేందుకు పదో తరగతి విద్యార్థులు ఆందోళన చెందారు. ఆ తర్వాత కనిపించని అక్షరాలతో నామమాత్రంగా బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు గదులను చూసుకునేందుకు నానాతంటాలు పడ్డారు.


