గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

భద్రాచలం: గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలను సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి రాహుల్‌ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువు పూర్తి చేసుకున్న ఆలెం వెంకటప్రసాద్‌, కురుస నవీన్‌ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఛతీస్‌గఢ్‌లో జరిగే ఆలిండియా ట్రైబల్‌ కేలో ఇండియా రెజ్లింగ్‌ క్రీడల్లో పాల్గొననున్నారు. గురువారం పీఓ తన చాంబర్‌లో వారికి క్రీడా సామగ్రి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి గోపాలరావు, ఏఎస్‌ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement