భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 19 నుంచి 27 వరకు శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ప్రతీ రోజు గణపతిపూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాసన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి లక్ష కుసుమార్చన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
28న జాతీయ లోక్ అదాలత్
జిల్లా జడ్జి పాటిల్ వసంత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారం, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, ఆస్తి పంపకాలు, అద్దె వివాదాలు, ఇతర సివిల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ–చలాన్, సైబర్ క్రైమ్, చోరీ, మనోవర్తి తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా తక్షణమే తీర్పు లభిస్తుందని, లోక్ అదాలత్‌లో గెలుపు ఓటములు ఉండవని, ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలోని కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదంటే నేరుగా సంబంధిత కోర్టులలో సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని సూచించారు.
Ð]l¬Wíܯ]l C…rÆŠæḥ
ప్రథమ సంవత్సర పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారం ముగిశాయని డీఐఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చివరి రోజున జిల్లాలోని 37 కేంద్రాల్లో మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించామని, మొత్తం 9,150 మంది విద్యార్థులకు గాను 8,660 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.


