ఐదు గంటల్లో.. ఐదు సాధారణ కాన్పులు | - | Sakshi
Sakshi News home page

ఐదు గంటల్లో.. ఐదు సాధారణ కాన్పులు

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

అశ్వారావుపేటరూరల్‌: ఐదు గంటల సమయంలో ఐదుగురు గర్భిణులకు సాధారణ కాన్పులు చేసి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బృందం రికార్డు నెలకొల్పింది. అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 5గంటల సమయం లోపు ఐదుగురు గర్భిణులు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆస్పత్రి వైద్యుల బృందం గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి దాదాపు ఐదు గంటల వ్యవధిలో వారందరికీ సాధారణ కాన్పులు చేయగా వీరిలో ముగ్గురికి మగ సంతానం, మరో ఇద్దరికి ఆడ సంతానం కలిగారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధా రుక్మిణి తెలిపారు. ప్రసూతి వైద్యురాలు డాక్టర్‌ మౌనిక, హెడ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఆశవర్ధని, వీర కుమారి, ఏఎన్‌ఎం సుజాత, అనూష తదితరులు సేవలందించారు.

అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిలో

రికార్డు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement