నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.500 కోట్లతో 50 గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండల కేంద్రంలోని గోదాములను బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్టాక్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రాను న్న సీజన్‌కు సంబంధించిన పంట ఉత్పత్తులు నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. వచ్చే సీజన్‌లో పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు 32 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను సిద్ధం చేశామని, 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ గోదాములు, వ్యవసాయ మార్కెట్‌లకు చెందిన మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను అద్దెకు తీసుకుంటున్నట్లు వివరించారు. జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, నంబూరి రామారావు, యడవల్లి నాగరాజు, నరేశ్ పాల్గొన్నారు.


