ఇల్లెందురూరల్/టేకులపల్లి: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధి కారులు సమష్టిగా భాగస్వాములవ్వాలని గ్రామీణా భివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత సూచించారు. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధిలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. టేకులపల్లి మండలంలో ప్రగతి ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను సందర్శించారు. చీపురు పట్టి పరిసరా లను పరిశుభ్రం చేశారు. డ్రైన్ ఎండ్ సోక్ నిర్మాణం ప్రారంభించారు. అజోల్లా పిట్, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల కోసం క్లష్టర్‌కోటి చొప్పున మీటింగ్ హాల్ నిర్మాణం కోసం రూ. 20లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది ప్రజారోగ్యం మెరుగ్గా ఉండేలా వైద్యశిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించా లని సూచించారు. మిషన్ భగీరథ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్రైడే, డ్రైడే నిర్వహించారు. వీధుల్లో అవగా హన ర్యాలీ చేపట్టారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ , డీఎల్‌పీవో ప్రభాకర్ అధికారులు బైరు మల్లేశ్వరి, గణేష్ గాంధీ, ధన్‌సింగ్, చిరంజీవి, పద్మావతి, ఇతర అధికారులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


