నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Mar 11 2026 7:45 AM | Updated on Mar 11 2026 7:45 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవా రం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

రామయ్య సన్నిధిలో

ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ చోళ్ల బొజ్జిరెడ్డి మంగళవా రం రాగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచ నం చేయగా, ఏఈఓ శ్రవణ్‌కుమార్‌స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.

కొనసాగుతున్న

మీడియేషన్‌ ట్రైనింగ్‌

ఖమ్మం లీగల్‌: ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులకు ఖమ్మంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 40 గంటల మీడియేషన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం కొనసాగుతోంది. ఈ మేరకు రిసోర్స్‌ పర్సన్లుగా చైన్నె నుండి వచ్చిన అరుణాచలం, విజయకమల, శశిదేవి, రత్నతార తరగతులు బోధిస్తున్నారు. మీడియేషన్‌ సులభతరమైన పరిష్కార ప్రక్రియ అని, దీంతో కాలయాపనలేని సత్వర పరిష్కారం లభిస్తుందని తెలి పారు. ఈ విధానం ద్వారా కక్షిదారుల సమస్యలు తెలుసుకుని కేసులను ఎలా పరిష్కరించాలో రోల్‌ ప్లే, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, డిబేట్ల ద్వారా వివరించారు. ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్‌, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన తరగతులను పరిశీలించారు.

పశువుల్లో గాలికుంటు నివారణకు టీకాలు

చండ్రుగొండ: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివా రణ టీకాలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 9న ప్రత్యేక శిబిరాలు ప్రారంభించామని, ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఈ క్యాంపులు కొనసాగుతా యని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని దామరచర్లలో మంగళవారం ఆయన టీకాల కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువుల్లో వైరస్‌ వల్ల సోకుతుందని, అలాంటి పశువుల్లో ఉత్పాదక, పునరుత్పత్తి శక్తి తగ్గుతుందని వెల్లడించారు. రైతులు తమ పశువులకు విధిగా గాలికుంటు టీకాలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పి.సావిత్రి, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ వి. సంతోష్‌, సిబ్బంది ఎండీ సలీం, ఆకుల శ్రీనివాసరావు, నరేష్‌, రాము పాల్గొన్నారు.

విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేయాలి

పాల్వంచ: విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభు త్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. నేషనల్‌ కో ఆర్డినేన్‌ కమిటీఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీ ర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు కేటీపీఎస్‌ ఏడో దశ గేట్‌ ఎదుట మంగళవారం భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. కార్యక్రమంలో జేఎసీ నాయకులు యాస్మిన్‌, బ్రహ్మాజీ, మహేష్‌, రఘువీర్‌, రాధాకృష్ణ, రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement