ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమం

Mar 10 2026 7:31 AM | Updated on Mar 10 2026 7:31 AM

భద్రాచలం: ప్రతీగిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా అధికారులు పనిచేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన గిరిజనుల నుంచి ఫిర్యాదు ల స్వీకరించారు. పరిశీలించి సంబంధిత యూ నిట్‌ అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ సందర్బంగా ఏపీఓ మాట్లాడుతూ గిరిజనులు స్వ యం ఉపాధిపథకాలు, చిన్న,మధ్యతరహా పరి శ్రమలద్వారా జీవనోపాధిని పొందాలని చెప్పా రు. అధికారులు సున్నం రాంబాబు, మధుకర్‌, లక్ష్మీనారాయణ, వేణు, ఉదయ్‌కుమార్‌, హెచ్‌ లింగానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

గనుల కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించాలి

సింగరేణి డైరెక్టర్‌ తిరుమలరావు

మణుగూరు టౌన్‌: సాంకేతిక పరిజ్ఞానం విని యోగంతో గనులకార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సింగరేణి డైరెక్టర్‌ (ఈ అండ్‌ఎం) తిరుమలరావు అన్నారు. సోమవా రం ఆయన పీకేఓసీ–2, కేసీహెచ్‌పీలను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న కన్వేయర్‌ బెల్ట్‌ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు. నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫ్యాబ్రికేషన్‌యార్డ్‌లో సాంకేతిక సదుపాయాలను పరి శీలించారు.ప్రాజెక్ట్‌కు సంబంధించిన పరికరాల తయిరీ విధానం, నాణ్యత ప్రమాణాలను సాంకేతిక అంశాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రాజెక్ట్‌లవివరాలు, పనుల పురోగతి భవిష్యత్‌ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.కార్యక్రమంలో జీఎంలు దుర్గం రాంచందర్‌, డి.వెంకటేశ్వర్లు, రామమూర్తి, ఇతర అధికారులు కేశవరా వు, శ్రీనివాస్‌, రమేశ్‌, కరీముల్లా, గౌడే, మధుసూదన్‌, సురేశ్‌, శ్రీనివాస్‌, శోభన్‌బాబు, ప్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రోళ్లపాడు చెరువులో కొండచిలువ

టేకులపల్లి: మండలంలోని రోళ్లపాడు చెరువులో కొండచిలువ కలకలం రేపింది. రోళ్లపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు చీమల నరేష్‌ ఆదివారం చేపలు పట్టేందుకు చెరువులో వల వేశాడు. సోమవారం వచ్చి తీయగా వలలో కొండచిలువ దర్శనమిచ్చింది. బయటకు తీసి చూడగా చనిపోయి ఉంది. కొండచిలువ 12 అడుగుల పొడవు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు.

మహిళా

డిగ్రీ కళాశాలలో తనిఖీ

పాల్వంచరూరల్‌: స్థానిక సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్‌ (డీసీఓ) కె.వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆహార నిల్వ ప్రదేశాలు, వంటగది, భోజనశాలను తనిఖీ చేశా రు. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బోయిన ఝాన్సీరాణి పాల్గొన్నారు.

వ్యక్తి మృతి

కామేపల్లి: మద్యం మత్తులో పురుగులు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని ముచ్చర్లకు చెందిన రేగుల సుధాకర్‌(35) కొద్ది కాలంగా మద్యానికి బానిసై భార్య రేణుకతో తరచూ గొడవపడే వాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకొని నెల క్రితం అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. భార్య రావడం లేదనే మనస్తాపంతో సుధాకర్‌ ఆదివారం మద్యం మత్తులో ఇంట్లోని పురుగుల మందు తాగాడు. స్థానికులు 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్యతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement