భద్రాచలం: భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు హాజరు కావా లని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులకు ఆలయ అధికారులు శనివారం హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రికలను అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను వారి నివాసాల్లో కలిశారు. ఈఓ దామోదర్, శ్రీనివాస రామానుజం, అంతర్వేది కృష్ణమాచార్య, భవాని రామకృష్ణ ఉన్నారు.
డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానం


