రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Mar 15 2026 1:19 AM | Updated on Mar 15 2026 1:19 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం మేళతాళాల నడు మ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రో క్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.

గురుకులాలకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా

పాల్వంచరూరల్‌: అధికారులు సంక్షేమ గురుకులాలకు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు జాప్యం చేయడంతో గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు నిండుకున్నాయి. దీంతో కట్టెల పొయ్యి పై వంటలు వండుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సంక్షేమ విద్యా సంస్థలపై గ్యాస్‌ బండ’ శీర్షిక న ఈ నెల 13 సాక్షి ప్రధాన ఎడిషన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో సంబంఽధిత శాఖ అధికారులు స్పందించారు. ఇక నుంచి గ్యాస్‌ ఇండెంట్‌ పెట్టుకున్న వెంటనే సంబంధిత గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ప్రేమ్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఎక్కడా గ్యాస్‌ కొరత లేదని పేర్కొన్నారు.

రేపు జాబ్‌మేళా

రుద్రంపూర్‌: నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్కా రెనాల్ట్‌లో ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తుండగా, డిగ్రీ అర్హత, 22 – 32ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 16వ తేదీన ఉదయం 10గంటలకు మొదలయ్యే జాబ్‌మేళాకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని, వివరాలకు 703690 2902 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement