కలెక్టర్‌ అంకిత్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ అంకిత్‌

Mar 15 2026 1:19 AM | Updated on Mar 15 2026 1:19 AM

కలెక్టర్‌ అంకిత్‌

ఎల్పీజీ గ్యాస్‌ కొరత లేదు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం):జిల్లాలోఎల్పీజీ గ్యాస్‌ కొరత లేదని, గ్యాస్‌ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. గ్యాస్‌ కొరత ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌తో కలిసి పౌరసరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరో గ్య, పోలీస్‌ శాఖలు, వివిధ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎల్పీజీ సేల్స్‌ అధికారులు, జిల్లాలోని గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీల యజమానులతో గ్యాస్‌ సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గృహ వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్‌ సిలిండర్ల సరఫరా జరుగుతోందన్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు,ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలు వంటిఅత్యవసరసేవలకు గ్యాస్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు..

గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధి అనంతరమే రీఫిల్‌ బుకింగ్‌కు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా, హోటళ్లు, కమర్షియల్‌ సంస్థలు గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను ఉపయోగించినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ ఎనర్జీ సప్లై మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీలర్లు రోజూ గ్యాస్‌ నిల్వలు, బుకింగ్‌ స్థితి, డెలి వరీ వివరాలు వంటి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని సూచించారు. పారదర్శకంగా గ్యాస్‌ సిలిండర్లు అందేలా డివి జన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిరు వ్యాపారులకు అవసరమైన 5 కేజీల సిలిండర్లు సరఫరా చేయాలన్నారు. ఎస్పీ రోహిత్‌రాజ్‌ మాట్లాడుతూ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోదాముల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement