భద్రాచలం: గిరిజన ఉత్పత్తులన్నింటిని భద్రగిరి మార్ట్‌లో అందుబాటులో ఉంచుతామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, గిరిజన రైతుల నుంచి సేకరించాల్సిన బియ్యం, పప్పుధాన్యాల వివరా లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడు తూ తేనె, మిల్లెట్ బిస్కెట్లు, పప్పుధాన్యాలు, వివిధ రకాల బియ్యం తదితర సరుకులు ఆర్గానిక్‌గా ఉండాలని సూచించారు. భద్రగిరి మార్ట్‌ను శ్రీరామనవమికి ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తికావా లని ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రగిరి మార్ట్‌కు సహకారం అందిచాలని, గిరిజన రైతులు సేంద్రియ ఎరువులతో పండించే పంటలను మార్ట్‌లో విక్రయించాలని సూచించారు. డేవిడ్‌రాజ్, ఉదయ్ కుమార్, రాంబాబు, వేణు, రమేష్, గన్యా, సమ్మ య్య, ప్రభాకర్‌రావు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఎటువంటి భయాందోళనలు లేకుండా పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలి తాలు సాధించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సూచించారు. శుక్రవారం భద్రాచలం గురుకుల కళాశాలలో పదో తరగతి విద్యార్థినులకు పరీక్షా కిట్లను, హాల్ టికెట్లను పంపిణీ చేసి మాట్లాడారు. సమాధానాలు అర్థమయ్యే రీతి లో చేతిరాత ఉండాలని సూచించారు. గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సి పాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


