బంగారు మధుపర్కపాత్ర వితరణ | - | Sakshi
Sakshi News home page

బంగారు మధుపర్కపాత్ర వితరణ

Mar 8 2026 7:43 AM | Updated on Mar 8 2026 7:43 AM

రూ. 14 లక్షలతో తయారు చేయించిన

ఎన్‌ఆర్‌ఐ దంపతులు

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి శనివారం రూ.14 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు మధుపర్క పాత్ర ను అమెరికాకు చెందిన అజరాపు శేషగిరిరావు, సరోజిని దంపతులు దేవస్థానం ఈఓ కె.దామోదర్‌రావుకు అందజేశారు. దాతలు తొలుత ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు మధుపర్క పాత్రను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ పాత్రను రోజూ నిత్యకల్యాణంలో ఉపయోగించాలని కోరారు.

స్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఐదుగురు అరెస్ట్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం నెహ్రూబస్తీ రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేశ్‌కోరి (40)పై హత్యాయత్నం ఘటనలో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ కరుణాకర్‌ శనివారం తెలిపారు. రైలు పట్టాలవద్ద స్నేహితుడితో మాట్లాడుతున్న నరేశ్‌పై నాతరి శ్రీనాథ్‌, లోకేశ్‌, శివసంజయ్‌, వసుకుల ఉదయ్‌, నాతరి రాజేశ్వరరావు అలియాస్‌ ఐలయ్య దాడిచేశారు. రోకలిబండతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితికి చేరాడు. అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా మారింది. ఇదిలా ఉండగా.. నెహ్రూబస్తీలో నిర్మలకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని ఐలయ్య కొన్నినెలల క్రితం ఆక్రమించాడు. అతడి వద్ద నిర్మల రూ.4లక్షలు అప్పుగా తీసుకుంది. అనా రోగ్యం కారణంగా ఆమె అప్పు తిరిగి ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లింది. దీంతో 18నెలల నుంచి ఆ ఇంట్లో ఐలయ్య కుటుంబంతో ఉంటున్నాడు. అప్పు గా తీసు కున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో నిర్మలకు నరేశ్‌ మద్దతు ఇస్తున్నాడని ఉద్దేశపూర్వకంగా నరేశ్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులను శనివారంఅరెస్టుచేసి, వారిపై హత్యా యత్నం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement