గుండాల: ప్రభుత్వ మోడల్ స్పోర్ట్స్ కాచనపల్లి, కిన్నెరసాని పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని జిల్లా క్రీడా అధికారి బొల్లి గోపాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన కాచనపల్లి పాఠశాలలో బ్యాటరీ టెస్టు ఉంటుందని, 4వ తరగతి చదువుతున్న గిరిజన బాలబాలికలు 5వ తరగతి అడ్మిషన్ల కోసం ఆధార్‌కార్డు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, పుట్టినతేదీ ధ్రువపత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కిన్నెరసాని పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గాలికుంటు టీకా
వేయించాలి
గుండాల: మండలంలోని రైతులు తమ పశువులకు గాలికుంటు టీకా తప్పని సరిగా వేయించాలని జిల్లా పశువైధ్యాధికారి మామిళ్ల వెంకటేశ్వర్లు అన్నా రు. ఆళ్లపల్లి మండలంలోని అనంతోగు గ్రామంలో 8వ విడత టీకా కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడా రు. రైతులు నల్ల, తెల్ల జాతి పశువులకు ఈ టీకాలు వేయించాలని సూచించారు. స్థానిక పశువైద్యాధికారులు గ్రామాల్లోకి వస్తున్నారని ఆ సమయంలో పశువులను పాకలోనే ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోడు పశువైద్యాధికారి సతీశ్, సిబ్బంది రమేశ్, పాషా, రైతులు పాల్గొన్నారు.
చోరీ కేసులో
నిందితుడు అరెస్ట్
అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఈ నెల 10న నిమ్మల సత్యనారాయణ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీతారాంపురానికి చెందిన సప్కా పవన్‌చోరీ చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డి వివరించారు.


