విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

కరకగూడెం: పాఠశాలల్లో విధి నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని మైనింగ్‌ డీఈ, మండల ప్రత్యేకాధికారి దినేష్‌కుమార్‌ అన్నారు. మండలంలోని భట్టుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. తరగతి, వసతి గదులు, డైనింగ్‌ హాల్‌, ఆర్వో వాటర్‌ప్లాంట్‌ పనితీ రును పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆరో గ్యకరమైన వాతావరణంలో చదువుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాలికల సంక్షేమం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్‌ వట్టం కాంతయ్య, పాఠశాల ఎస్‌ఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement