నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి

Mar 11 2026 7:45 AM | Updated on Mar 11 2026 7:45 AM

విద్యార్థుల ఆరోగ్యంపై రాజీ పడితే

చర్యలు తప్పవు

కలెక్టర్‌ అంకిత్‌ హెచ్చరిక

పలు పాఠశాలల్లో తనిఖీలు

బూర్గంపాడు: విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజీ పడితే చర్యలు తప్పవని కలెక్టర్‌ అంకిత్‌ హెచ్చరించా రు. బూర్గంపాడులోని తెలంగాణ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలతో పాటు కేజీబీవీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, విద్యా ప్రమాణా లను పరి శీలించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలో వంట, తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బయటి ఆహార పదార్థాలను అనుమతించవద్దని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారిని చూసేందుకు వచ్చే తల్లిదండ్రులకు కూడా భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించా రు. అనంతరం కేజీ బీవీలో మెనూ అమల్లోఉన్న లోపా లపై తీవ్రఅసహనం వ్యక్తంచేశారు. నిర్ణీత మెనూ ప్రకా రం నాణ్య మైన భోజనం అందించాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఇంగ్లిష్‌ పఠనా సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలకు ఉదయం రాగిజావ, పల్లీపట్టీలు అందించాలన్నారు. అధికారుల పనితీరు రికార్డుల్లో కాకుండా క్షేత్రస్థాయిలో మెరుగ్గా ఉండాలన్నారు.

కలుషిత ఆహారం పునరావృతం కావొద్దు

మణుగూరు రూరల్‌: వసతిగృహాలు, విద్యాసంస్థల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని అన్నారు. ఇటీవల మణుగూరులో కొందరు విద్యార్థినులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురయ్యారని, ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించా లని అధికారులకు సూచించారు. పాఠశాలలు, వసతిగృహాల్లో ఆహార భద్రత కమిటీ సభ్యులు రుచి చూశాకే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు.

‘పది’ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఈనెల 14 నుంచి ఏప్రిల్‌ 16వరకు జరిగే పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ శాఖల అధి కారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,731 మంది రెగ్యులర్‌, 404 మంది ప్రైవేట్‌ విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీ సెక్షన్‌ అమలు, జిరాక్స్‌ కేంద్రాలపై నియంత్రణ వంటిచర్యలు తీసుకోవా లని సూచించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణాసౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

శిక్షణ ఏర్పాట్ల పరిశీలన

చుంచుపల్లి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజుల కార్యాచరణపై సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు కొత్తగూడెం క్లబ్‌లో ఈనెల 12న నిర్వహించే శిక్షణ ఏర్పాట్లను కలెక్టర్‌ అంకిత్‌ పరిశీ లించారు. హాజ రయ్యే ప్రజాప్రతినిధులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా సీట్లు కేటాయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శిక్షణ సజావుగా సాగేలా అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలన్నారు. హాజరయ్యే ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన, ఆర్డీఓ మధు, డీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్‌ కమిషనర్‌ సుజాత, డీఎంహెచ్‌ఓ తుకా రాం రాథోడ్‌, డీపీఓ సుధీర్‌, తహసీల్దార్‌ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement