ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి

Mar 15 2026 1:19 AM | Updated on Mar 15 2026 1:19 AM

జూలూరుపాడు: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని డీఆర్‌డీఓ, అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాచందన అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యా చరణలో భాగంగా శనివారం అనంతారం, గాంధీనగర్‌ గ్రామ పంచాయతీల నర్సరీలను ఆమె పరిశీ లించారు. డ్రైన్‌ ఎండ్‌ ఇంకుడు గుంతలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాల ప్రగతిపై సర్పంచ్‌లు, సిబ్బందిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎంపీఓ టి.తులసీరామ్‌, ఈజీఎస్‌ ఏపీఓ రామారావు, అనంతారం, గాంధీనగర్‌ సర్పంచ్‌లు కొర్సా రమేష్‌, బానోత్‌ మంగూలాల్‌, పంచాయతీ కార్యదర్శులు శైలజ, లక్ష్మీనారాయణ, ఈజీఎస్‌ టీఏ జోదా భాయి, ఎఫ్‌ఏ నాగమణి, మేట్లు, వన సేవకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement