ఆర్టీసీ డ్రైవర్‌కు జాతీయస్థాయి అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌కు జాతీయస్థాయి అవార్డు

Mar 17 2026 7:38 AM | Updated on Mar 17 2026 7:38 AM

అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామ వాసి, మణుగూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇల్లుటూరి మహేశ్‌కు బహుజన సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో సోమవా రం జరిగిన కార్యక్రమంలో సేవారత్న జాతీయ అవార్డు అందజేశారు. విధినిర్వహణలో నిజాయితీతో బస్సులో దొరికిన సొమ్మును ఆర్టీసీ అధికారులకు అప్పగించిన మహేశ్‌ తెలంగాణ ఆర్టీసీ అధికారులు మన్ననలు పొందాడు. మహే ష్‌ నిజాయితీని గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఆధ్వర్యంలో అవార్డు అందజేశారు.

సారపాక వాసికీ..

బూర్గంపాడు: సారపాకకు చెందిన పరుశురాం పరివార్‌ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్‌కు బెస్ట్‌ సోషల్‌ సర్వీస్‌ జాతీయ పురస్కారం దక్కింది. తిరుపతిలో సోమవారం జరిగిన సౌత్‌ ఇండియా బహుజన రైటర్స్‌ 18వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయనకు అవార్డును అందించారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాజశేఖర్‌ అవార్డు అందుకున్నారు.

హెచ్‌ఎం

డిప్యూటేషన్‌ రద్దు

దుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం భారతి డిప్యూటేషన్‌ను ఐటీడీఏ పీఓ రాహుల్‌ రద్దు చేసి పాత స్థానానికి పంపారు. కె.రేగుబల్లి–2 బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం భారతి వేధింపుల కారణంగా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పాయం ధనుష్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తండ్రి కార్తీక్‌ ఐటీడీఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ అశోక్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అధికారులు విచారణ చేపట్టి ఐటీడీఏ పీఓకు నివేదిక అందించగా.. భారతిని కె.రేగుబల్లి–1 బాలికల ఆశ్రమ పాఠశాలకు పంపారు. ఆమె గతంలో అక్కడ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పుడే కె.రేగుబల్లి–2 పాఠశాలకు హెచ్‌ఎంగా డిప్యూటేషన్‌పై వచ్చారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

ఇల్లెందురూరల్‌: మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఐక్య కూటమి నాయకుడు ఎల్లంపల్లి బుచ్చయ్య, కాంగ్రెస్‌ నేత నాగుల్‌మీరా సోమవారం బైక్‌పై ముకుందాపురం నుంచి ఇల్లెందు వెళ్తుండగా బైపాస్‌ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల్‌మీరాకు స్వల్పంగా గాయం కాగా ఎల్లపల్లి బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బుచ్చయ్యను మహబూబాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆటో ఢీకొని మహిళ మృతి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఫారెస్ట్‌ ఆఫీస్‌ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు లో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన తల్లీకూతుర్లు నాగేశ్వరమ్మ (55), చిట్టెమ్మ రాత్రి సమయంలో రోడ్డు పక్క న నడుచుకుంటూ వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టడంతో నాగేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. చిట్టెమ్మకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిట్టెమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ పాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సతీశ్‌ తెలిపారు. కాగా, ఫారెస్ట్‌ ఆఫీస్‌ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చేలా నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన దుకాణాల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నా రు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు.

వాడపల్లికి ప్రత్యేక బస్సు

ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం డిపో నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఎం శివప్రసాద్‌ తెలిపారు. ఖమ్మం కొత్తబస్టాండ్‌ నుంచి ప్రతి శుక్రవారం బస్సు రాత్రి 8 గంటలకు బయలుదేరి, శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటుందని, దర్శనం తర్వాత తిరిగి ఖమ్మం చేరుకుంటుందని వెల్లడించారు. ఈ సర్వీసుకు రాను–పోను చార్జి పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.470గా నిర్ణయించామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 91364 46666 నంబర్‌లో సంప్రదించాలని, ఇంటి వద్ద నుంచే సీట్‌ బుక్‌ చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌ అయితే www. tgsrtcbus. in వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement