రుద్రంపూర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా వీకే సీఎం(కోల్‌మైన్) గని నుంచి సుమారు 1.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తామని ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌పీఓఏ క్లబ్‌లో నిర్వహించిన ఆత్మీ య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి బొగ్గు రవాణాను ప్రారంభించారని పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 10 ఏళ్లలో పీవీకే–5 గనిలో నిక్షేపాలు తగ్గుతాయని అన్నారు. అయితే వీకే ఓసీ విస్తరణ జరగనుందని, తద్వారా 35 ఏళ్ల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మోహన్‌రావు, రామకృష్ణ, యోహాన్, నర్సింహారావు, నాయకులు ఎండీ రజాక్, గట్టయ్య పాల్గొన్నారు.


