చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఇటీవల మృతిచెందిన వ్యక్తిని ఖననం చేయ గా.. ఆ మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి సోమ వారం శవపరీక్ష నిర్వహించారు. వివరాలిలా ఉన్నా యి. ఈ నెల 11వ తేదీన గ్రామానికి చెందిన ఎస్కే జాఫర్ (35) అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడ్డాడు. మృతుడి తమ్ముడు జావిద్ ఫిర్యాదు మేర కు ఎస్‌ఐ శివరామకృష్ణ దర్యాప్తు చేపట్టారు. ఓ వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తనతల్లితో కలిసి తండ్రిని చంపేశారని మృతుడి కుమార్తె ఆసియా చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు డాక్టర్ వెంకటరమణమూర్తి, తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు.
సంప్‌లో పడిన కాంట్రాక్టర్
ఇల్లెందు: పట్టణంలోని నంబర్–2 బస్తీకి చెందిన ఓ సింగరేణి కాంట్రాక్టర్ నీటి సంప్‌లో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయ న్ను ఖమ్మానికి తరలించారు. గఫార్ సింగరేణిలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా పను లు లేకపోవటం, చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉండటంతో పాటు ఖమ్మంలో ఓ వ్యాపారితో ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన ఆయన మానసికంగా కుంగిపోయ్యారు. ఆదివారం ఇంటి వద్ద నీటి సంప్‌లో పడిపోయాడు. తీవ్రగాయాలు కావటంతో ఖమ్మా నికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మెడికల్ షాపు వద్ద
పర్సు చోరీ
టేకులపల్లి: మెడికల్ షాపు వద్ద ఓ మహిళకు చెందిన పర్సును ఇద్దరు గుర్తు తెలియని మహిళలు చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ కథనం ప్రకారం.. సోమ వారం బోడు గ్రామానికి చెందిన కుంపటి శ్రీలత మండల కేంద్రంలోని బాలాజీ మెడికల్ షాప్ వద్దకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు మహిళలు శ్రీలత చేతిలోని ప్లాస్టిక్ కవర్‌ను బ్లేడుతో కట్‌చేసి, అందులోని పర్సును చోరీచేశారు. పర్సులో రూ.10 వేలు ఉన్నాయని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఇల్లెందు: పట్టణంలోని దాసరిగడ్డలో అర్ధరాత్రి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి రాజు కుటుంబంపై నరసింహం కుటుంబం దాడి చేసింది. రాజు కుమారుడు, నరసింహం కుమార్తె ప్రేమలో ఉన్నారని, రెండు రోజులుగా వీరు కనిపించకుండా పోవటంతో నరసింహం కుటుంబం రాజు కుటుంబంపై దాడి చేసింది. రాజు తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబ సభ్యు లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజును ఖమ్మానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాజు భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ చేపట్టారు.
సర్వీసు సెంటర్‌లో చోరీ
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లిలోని గణేశ్ హోండా సర్వీస్ సెంటర్‌లో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుకాణంలోని సుమారు రూ.6 లక్షల విలువైన వాహన ఇంజన్లు, చాంబర్లు, అలై చక్రాలు, గేరు చక్రాలు, బోర్లు, క్లచ్ సెట్లు, కాపర్, ఎలక్ట్రికల్ సామగ్రి.. మొత్తంగా 4 క్వింటాళ్ల స్క్రాప్‌ను తస్కరించినట్లు గుర్తించారు. షాపు యజ మాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


