బాధితులకు అండగా.. | - | Sakshi
Sakshi News home page

బాధితులకు అండగా..

Mar 8 2026 7:43 AM | Updated on Mar 8 2026 7:43 AM

పునరావాసం కల్పిస్తున్నాం..

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోనిభరోసా సెంటర్‌ మహిళలకు అండగా నిలుస్తోంది. 2024, ఫిబ్రవరి 6న ప్రారంభించగా, లైంగిక నేరాల బాధితులకు సమగ్ర సహా యం అందిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 214 కేసులు భరో సా సెంటర్‌లో నమోదయ్యాయి. వాటిలో 163 పోక్సో కేసులు, 35అత్యాచార కేసులు, 16ఇతర కేసులు ఉన్నాయి. బాధితులకు రూ.45లక్షల పరిహారం అందించాలని 113దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. రూ.18లక్షలు మంజూరు కాగా,49 మందికి పరిహారం అందించారు. అదనంగా విక్టిమ్‌ అసిస్టెన్స్‌ ఫండ్‌ ద్వారా 15మందికి రూ.1,10,000 సహాయం అందజేశారు. భరోసా కేంద్రంలో మొత్తం 214 కౌన్సెలింగ్‌ సెషన్లు నిర్వహించారు. బాధితులకు మానసిక సహాయం, వివిధ థెరపీలు, నిరంతర ఫాలో అప్‌ సేవలు అందిస్తున్నారు.

భరోసా కేంద్రం సేవలు

భరోసా కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 214 కేసులు నమో దు చేశాం. బాధితులకు న్యాయం, వైద్య సహాయం అందిస్తున్నాం. మానసిక పరి రక్షణ, పునరావాససేవలు అందించడంలో భరోసా సెంటర్‌ నిరంతర కృషి చేస్తోంది. –చల్లా అరుణ,

భరోసా సెంటర్‌ ఎస్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement