సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కిశోర్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కిశోర్‌

Mar 18 2026 9:39 AM | Updated on Mar 18 2026 9:39 AM

భద్రాచలంటౌన్‌: జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా సారపాక మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ గుగులోత్‌ కిశోర్‌శివరాంనాయక్‌ ఎన్నికయ్యారు. భద్రాచలంలోని రెడ్ల సత్రంలో మంగళవారం సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సాదాని భూమన్నయాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణను నియమించారు. కాగా, కిశోర్‌శివరాంనాయక్‌ ఎన్నిక ఏకగ్రీవమని ముందే ప్రకటించడంతో జిల్లాలోని పలువురు సర్పంచులు ఈ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.

ఆంధ్రాలో ఆళ్లపల్లి వాసి మృతి

గుండాల: విద్యుత్‌ మరమ్మతు పనులు చేపడుతుండగా విద్యుదాఘాతంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన దారం వెంకటేశ్‌ అలియాస్‌ గద్దర్‌ (20) రెండు నెలల క్రితం విద్యుత్‌ కంపెనీలో పనిలో చేరాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఓ గ్రామంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా 11 కేవీ నుంచి ఒక్కసారిగా కరెంటు సరఫరా కావడంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామమైన ఆళ్లపల్లికి తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement