సామాన్యులపై ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

సామాన్యులపై ధరాఘాతం

Mar 17 2026 7:38 AM | Updated on Mar 17 2026 7:38 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ట్రంప్‌ యుద్ధ కాంక్ష భారతదేశంలో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. గ్యాస్‌ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. గ్యాస్‌ సహా ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు కేంద్ర విధానాలే కారణమని నినదించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంపన్న దేశాలపై దాడులు చేసి అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి ఇరాన్‌పై దాడులు చేస్తున్నారన్నారు. మోదీ అలీన దేశపు ప్రధానిగా యుద్ధాన్ని నివారించకపోగా యుద్ధం వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్‌తోపాటు సిద్దినేని కర్ణకుమార్‌, బీజీ క్లెమెంట్‌, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్‌, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి, సుధాకర్‌, లక్ష్మీనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement