ప్రజారోగ్య పరిరక్షణ పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్య పరిరక్షణ పాటించాలి

Mar 18 2026 9:39 AM | Updated on Mar 18 2026 9:39 AM

పాల్వంచ: ఆహార భద్రత, పరిశుభత్ర పాటించడం ప్రజా రోగ్య పరిరక్షణకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ అన్నారు. స్థానిక డిప్యూటీ డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం ఆయన రెస్టారెంట్‌ యజమానులు, ఆహార విక్రేతలు, వంటచేసే వారికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఆహార పదార్థాల తయారీ, వంటచేసే పరిసరాలు, తాగునీటితో పాటు వంట తయారీదారులు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి శరత్‌, రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ, హైజిన్‌ ట్రైనర్‌ నందిని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత డీఎంహెచ్‌ఓను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement