నవమి గోడపత్రికల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నవమి గోడపత్రికల ఆవిష్కరణ

Mar 14 2026 7:45 AM | Updated on Mar 14 2026 7:45 AM

భద్రాచలం: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నవమి ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. తొలుత దేవస్థానం అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, దేవస్థానం ఈవో దామోదర్‌రావు, ఏఈవో భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement