● వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం ● టీజీఎన్‌పీడీసీఎల్ ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి
కరకగూడెం: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కరకగూడెంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘లోకల్ కోర్టు’లో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని వెల్లడించారు. విద్యుత్ నాణ్యత పెంపుతో వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాలకు మెరుగైన సరఫరా అందుతుందని చెప్పారు. వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా ఫోరం దృష్టికి తీసుకురావచ్చని సూచించా రు. ప్రతీ సమస్యనూ పారదర్శకంగా పరిష్కరించడమే ఫోరం బాధ్యతని స్పష్టం చేశారు. అనంతరం గృహజ్యోతి పథకం అందండం లేదని, పోడు భూముల్లో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చైర్మన్‌కు వినతులు అందజేయగా, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఎన్‌పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ రమేష్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, ఎస్‌ఈ మహేందర్, ఎస్‌ఏఓ శ్రీధర్, డీఈ జీవన్‌కుమార్, ఏడీఈ ఉమామహేశ్వరరావు, ఏఈలు రాజశేఖర్, వేణుగోపాల్, లారెన్స్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


