దుమ్ముగూడెం: ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్ హెచ్చరించారు. శుక్రవారం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మండలంలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు. దుమ్ముగూడెం, నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇవ్వొద్దని హెచ్చరించారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీధర్, డీఐఓ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రతాప్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


