సింగరేణి జామాయిల్‌ నరికివేత | - | Sakshi
Sakshi News home page

సింగరేణి జామాయిల్‌ నరికివేత

Mar 10 2026 7:31 AM | Updated on Mar 10 2026 7:31 AM

టేకులపల్లి: ఓబీ మట్టి గుట్టలపై ఉన్న జామాయిల్‌ కలపను నరికి తరలిస్తున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడంలేదు. సుమారు 15 ఏళ్ల క్రితం సింగరేణి ఓబీ గుట్టలపై కేఓసీ యాజమాన్యం జామాయిల్‌ మొక్కలను నాటింది. అవి ఏపుగా ఎదిగాయి. దీంతో అక్రమార్కులు జామాయిల్‌ కలపను రాత్రికి రాత్రే నరికి విక్రయించుకుంటున్నారు. నెల రోజులుగా ఈ వ్యవహారం సాగుతున్నా కేసీఓ అధికారులు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

అంబులెన్స్‌ డ్రైవర్‌కు

పదేళ్ల జైలు శిక్ష

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/బూర్గంపాడు: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదంతో తల్లీకూతుళ్ల మృతికి కారణమైన అంబులెన్స్‌ డ్రైవర్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌ సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా.. 2020, జనవరి 1న బూర్గంపాడు సమీపంలోని పుల్లేరు వాగు వద్ద తోట చంద్రకళ (28), ఆమె కూతురు శ్రీ లాస్య రోడ్డు పక్కన ద్విచక్రవాహనం ఆపి నిల్చున్నారు. ఈ క్రమంలో భద్రాచలానికి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆకుల దుర్గాప్రసాద్‌ మద్యం మత్తులో అంబులెన్స్‌ నడుపుతూ ఢీకొట్టాడు. దీంతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. న్యాయమూర్తి 14 మంది సాక్షులను విచారించగా, నేరం రుజువు కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీపీ పీవీడీ లక్ష్మి వాదనలు వినిపించారు. కోర్టు నోడల్‌ ఆఫీసర్‌, ఎస్‌ఐ డి రాఘవయ్య, సిబ్బంది ఎన్‌.వీరబాబు, పీసీ మహ్మద్‌ అక్రమ్‌ సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement