పాల్వంచ: పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మోకాలి మార్పిడి (టోటల్ నీ రీప్లేస్‌మెంట్) శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించా రు. వరంగల్‌కు చెందిన ఐ.కవిత(52) గత మూడేళ్లుగా ఎడమ మోకాలు కీళ్ల నొప్పితో బాధపడుతూ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. దీంతో శస్త్ర చికిత్సకు సుమారు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేక పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ శైలేష్‌కుమార్‌ను సంప్రదించారు. దీంతో పరీక్షించి, వైద్య బృందంతో కలిసి శనివారం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మోకా లు కీళ్ళ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనస్తీషియా వైద్యుడు, సూపరింటెండెంట్ రాంప్రసాద్, సిబ్బంది రేవతి, స్వర్ణలత, ఉమ, సర్పరాజ్, నర్సింహ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.


