మత్తుకు బానిస కావొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్తుకు బానిస కావొద్దు

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

ఎస్పీ రోహిత్‌ రాజు

చుంచుపల్లి: మత్తుకు బానిస అయితే జీవితం అంధకారంగా మారుతుందని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు, ఈగ ల్‌ టీమ్‌ ఆధ్వర్యంలో చాతకొండ రోడ్డులోని కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా డ్రగ్స్‌ విని యోగంపై గురువారం నిర్వహించిన అవగాహ న కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుని, ఆ లక్ష్యాలను సాధించే దిశగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ ఉండాలని అన్నా రు. జిల్లాలో గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు 6,500 కేజీల గంజాయిని సీజ్‌ చేశామన్నారు. అనంతరం అందరూ ప్రతిజ్ఞ చేశారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి కోటేశ్వరరావు, ఎకై ్సజ్‌ అడిషనల్‌ ఎస్పీ కరంచంద్‌, ఎంఈఓ కృష్ణయ్య, సీఐలు రామ్‌ ప్రసాద్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, ఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు.

‘ప్రాణం తీసిన పైసలు’ పుస్తకం ఆవిష్కరణ

ఇల్లెందు: పట్టణానికి చెందిన టీబీజీకేఎస్‌ నేత ఎస్‌.రంగనాథ్‌ రచించిన ‘ప్రాణం తీసిన పైసలు’ పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు ఇలాంటి పుస్తకాలు తీసుకురావటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు దిండిగాల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు సంగు కిరణ్‌కుమార్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అపస్మారక స్థితికి వెళ్లాడు. ఖమ్మంలో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబం కావడంతో కిరణ్‌ తల్లిదండ్రులు వైద్య ఖర్చులకు ఆర్థిక స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి వైద్యం కోసం సహాయం చేయాలని దాతలను కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయాల్సిన ఫోన్‌ పే నంబర్‌ 9848137116 (తాటిపాముల రమేష్‌).

మట్టి తరలించకుండా

కందకం..

ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) ప్రధాన కాలువ మట్టి అక్రమ తోలకాలను అడ్డుకునేందుకు అధికారులు దృష్టి సారించారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు కలిసి కాలువకు వెళ్లే ప్రధాన దారికి అడ్డంగా గురువారం రాత్రి ట్రంచ్‌ (కందకం) తవ్వించారు. మాధారం–పూసుగూడెం అటవీ ప్రాంతంలోని కెనాల్‌ పరిసరాల్లోని మట్టి అర్ధరాత్రి వేళ భారీగా బయటకు తరలిపోతోంది. ఆర్‌అండ్‌బీ రోడ్డు సైడ్‌బర్మ్‌ పేరిట నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నెలకు మూడు, నాలుగు రోజులపాటు అనుమతిపొంది ఇష్టారీతిన అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.

పందెంరాయుళ్లపై

కేసు నమోదు

దమ్మపేట: మండలంలోని దురదపాడు గ్రామ శివారులో గురువారం కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రెండు కోడి పుంజులు, రూ.8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement