కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం కెమిస్ట్రీ పేపర్–2, కామర్స్ పేపర్–2 పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 7,885 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 7,641 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని, అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్‌నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం సరిరామ్ తెలి పా రు. బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ, ఇంజ నీరింగ్ / డిప్లమా తదితర డిగ్రీ కోర్సులు పూర్తి చేసినఅభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2021 తర్వాత డిగ్రీపూర్తి చేసిన వారు దరఖా స్తు చేసుకోవచ్చనితెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు కేంద్రప్రభుత్వ ఎన్‌టీఏ 2.0 పోర్టల్ https:// nats. education. gov.in ద్వారా ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. ఎంపికై న వారికి ఆర్టీసీ ఖమ్మం రీజి యన్ పరిధిలోనిడిపోలు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇస్తామని ఆర్‌ఎం తెలిపారు.
కృత్రిమ మేధతో
అభ్యసన అభివృద్ధి
కొత్తగూడెంఅర్బన్: కృత్రిమ మేధతో అభ్యసన అభివృద్ధి సాధించాలని జిల్లా అకాడమిక్ మాని టరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్ అన్నారు. జిల్లాలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న 84 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ద్వారా అభ్యసన అభివృద్ధి అనే కార్యక్రమంపై రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవా రం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో 6 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభిచామని, ఈ సంవత్సరం 84 పాఠశాలకు విస్తరించామ ని వివరించారు. 592 మంది విద్యార్థులకు చేరువ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు 65 మంది ఉపాధ్యాయులు, రెండో రోజు 70 మంది, మొత్తం 135 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్‌గా రేణుక, వెంకట నిర్మల, పుష్పశ్రీ, శేషగిరిరావు, శ్రీనివాసరావు వ్యవహరించారు.
హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు
జూలూరుపాడు: జూలూరుపాడులో హోటళ్లు, దుకాణాల్లో శుక్రవారం పౌరసరఫరాల శాఖ, రెవె న్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించా రు. హోటళ్లలో వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. దుకాణాల్లో, అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వచేసిన ప్రాంతాల్లో తనిఖీచేసి, గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నారు. 34 గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నామని, ఇందులో 33ఖాళీ సిలిండర్లు, ఒకటి ఫుల్ సిలిండర్ ఉన్నాయని కొత్తగూడెం ఏసీఎస్‌ఓ ఆర్.వరదరాజులు తెలిపారు. డీటీ రాజులు, ఆర్‌ఐలు ఎన్.వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.
స్నేహానికి నిదర్శనం
ఇఫ్తార్ విందు
ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు: త్యాగం, స్నేహానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని సింగరేణి స్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలపగా, వారు ఎమ్మెల్యేకు దట్టి కట్టి టోపీతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడారు. ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, వీసీ మార్కెట్ రాజు, సర్పంచ్‌లు, ముస్లిం కౌన్సిలర్లు ఖుష్భూ, సైదామియా, ఎండీ జాఫర్, ముస్లిం పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, డి. వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య పాల్గొన్నారు.


