సూపర్‌బజార్(కొత్తగూడెం): హైదరాబాద్ కేంద్రంగా తెల్లాపూర్ ఏకలవ్య ఆర్చరీ అకాడమీ లో జరిగిన ఆర్చరీ మినీ స్టేట్ మీట్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. అండర్–10 విభాగంలో మొత్తం 76మంది క్రీడాకారులు పాల్గొనగా ఎం.విక్రాంత్ బంగారు పతకం సాధించాడు. అండర్–15 విభాగంలో 50 మందికి గాను ఎం.కార్తీవర్మ రజతం, అండర్–13 లో ఆర్.రిషి తొమ్మిదోస్థానం సాధించాడు. అంతేకాక పలువురు ఈ నెల 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగే జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యారు. క్రీడాకారులతో పాటు కోచ్ తానం కల్యాణ్‌ను డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి మంగళవారం అభినందించారు.
లాభాల పంటలనే
సాగుచేయండి..
గుండాల: మండలంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రైతులు తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జంగా కిశోర్ అన్నారు. మండలంలో సాగుచేస్తున్న ఆయిల్‌పాం తోటలను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రస్తు తం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, పూలు, తైవాన్ జామ, నిమ్మ, కరివేపాకు, బోడ కాకర, తీగ చిక్కుడు, మునగ, నేరేడు, సీతాఫలం, డ్రాగన్‌ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తే.. ఎకరానికి నికరంగా రూ.లక్ష ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయిల్ పాం పంట ప్రాధాన్యత, సాగు విధా నం, అధిక దిగుబడులు పొందే పద్ధతులు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సాయనపల్లి సర్పంచ్ కల్తీ కృష్ణవేణి, ఉద్యానవన అధికా రి దేవీప్రసాద్, ఆయిల్‌ఫెడ్ ప్రతినిధి శంకర్, వికాస్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
చదువే విద్యార్థుల
భవితకు పునాది
కొత్తగూడెంఅర్బన్: చదువే విద్యార్థి భవితకు పునాదిఅని, ప్రతి విద్యార్థి చదువుకుంటేనే ఉన్న త స్థానానికి చేరుకోవచ్చని కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్ అన్నా రు. పాత కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి బాలమేళా 2.0 కార్యక్రమం ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లా లో మాత్రమే వినూత్నంగా చేపట్టిన బాలమేళా విజయవంతం కావడం సంతోషకరమన్నారు. అనంతరం డీఈఓ బి.నాగలక్ష్మి మా ట్లాడుతూ.. జిల్లాస్థాయి బాలమేళాలో ప్రతిభ కనబర్చిన పిల్లలు.. ప్రోత్సహించిన ఉపాధ్యాయులూ అభినందనీయులని పేర్కొన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష మాట్లాడారు. అనంతరం 1 నుంచి 5 తరగతుల వరకు ఎఫ్‌ఎల్‌ఎన్‌లో గెలుపొందిన విద్యార్థులకు, 1 నుంచి 9తరగతుల వరకు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎ. నాగరాజశేఖర్, ఎస్‌కే సైదులు, ఎన్.సతీశ్‌కుమా ర్, బి.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


