రామయ్యకు స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు స్నపన తిరుమంజనం

Mar 12 2026 7:31 AM | Updated on Mar 12 2026 7:31 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్యకు స్నపన తిరుమంజనం జరిపారు. నిత్యకల్యాణం కమనీయంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

డిగ్రీ కళాశాల లెక్చరర్‌కు డాక్టరేట్‌

పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటాన్‌మస్‌)లో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న లీలా సౌమ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్లోబల్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా సాధించారు. భారతీయ ఆంగ్ల సాహిత్యంపై ఆమె పరిశోధనా పత్రం సమర్పించడంతో వర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఆమెను కళాశాలలో ప్రిన్సిపాల్‌ పి.పద్మ, అధ్యాపకులు సన్మానించారు.

ఏఈఓకు గౌరవ

డాక్టరేట్‌

మణుగూరు టౌన్‌: మండల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) కొమరం లక్ష్మణరావుకు హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్‌ కల్చర్‌, రీసెర్స్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అఖిల భారతీయ ఆదివాసీ వికాస్‌ పరిషత్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా సేవలందస్తున్న సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.

నిత్యావసరాలన్నీ

‘గిరి’ మార్ట్‌లోనే..

ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌

భద్రాచలం: ప్రజలందరికీ అవసరమైన ఆర్గానిక్‌ నిత్యావసర సరుకులన్నీ గిరిజన మార్ట్‌లో లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌ తెలిపారు. బుధవారం ఐటీడీఏలో గిరిమార్ట్‌లో సంప్రదాయ గిరిజన ఉత్పత్తుల సేకరణ యూనిట్‌ అధికారులతో చేపట్టాల్సిన కార్యాచరపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గిరిమార్ట్‌లో ఎస్‌హెచ్‌జీ మహిళలు, గిరిజనుల చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేస్తున్న తినుబండారాలు, తృణధాన్యాలు, స్వీట్లు, నూనె, ఇతర సామగ్రి, అన్ని రకాల పచ్చళ్లు తదితర నిత్యావసరాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు సమ్మయ్య, మధుకర్‌, ఉదయ్‌ కుమార్‌, వేణు, గన్యా, లక్ష్మీనారాయణ, ప్రభాకర్‌ రావు, రమేష్‌, హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement